మన చెంతనే పాలేటీవ్ కేర్‌ సెంటర్ సేవలు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

మన చెంతనే పాలేటీవ్ కేర్‌ సెంటర్ సేవలు
– బాధితులందరు సద్వినియోగం చేసుకోవాలి
– డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రవీంద్ర యాదవ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : మన జిల్లా పరిధిలోనే పాలేటీవ్ కేర్ సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని బాధితులు అందరు సద్వనియోగం చేసుకోవాలని తాండూరు డీప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ పాలేటీవ్ కేర్ దినోత్సవంను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో డా.రవీంద్ర యాదవ్‌తో పాటు పలువురు వైద్యులు పాలేటీవ్ కేర్ సెంటర్ సేవలపై అవగాహన కల్పించారు.

క్యాన్సర్‌, హృద్రోగులు, పక్షవాతం, నరాల వ్యాధిగ్రస్తులు వారు.హైదరాబాదు ఆసుపత్రులకు వెళ్లకుండా వికారాబాద్‌లోనే పాలేటీవ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో బాధితులకు మన చెంతనే సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా బాధితుల అవసరాలను బట్టి ఇంటి వద్దకే సేవలు అందుబాటులో వస్తాయని తెలిపారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా మధుమేహం, రక్తపోటు, క్యాన్సరు, హృద్రోగం రోగాల నుంచి జాగ్రత్తలతో పాటు పొగాకు, మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్, డా.నిరోషా, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డా.ఆనంద్ గోపాల్ రెడ్డి, పాలేటీవ్ వైద్యాధికారి డా.వాహబ్, ఎన్‌సీడీ కోఆర్డీనేటర్లు రేణు కుమార్, జయరాం, డా. రిజ్వాన, డా. సుప్రియ, ఫిజియోథెరపిస్టులు, స్టాఫ్ నర్స్, ఆసుపత్రి వైద్య సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కార్మికులకు ఉచిత రక్తపరీక్షలు