కార్మికులకు ఉచిత రక్తపరీక్షలు
– సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో నిర్వహణ
– 250మందికి పైగా పరీక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కార్మికులకు ఉచితంగా రక్తపరీక్షలు నిర్వహించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో సీఎస్సీ హెల్త్ కేర్ ద్వారా తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండులో ఈ పరీక్షలు నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన కార్యక్రమంలో కార్మికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సీఎస్సీ హెల్త్ కేర్ డిస్ట్రీక్ కోఆర్డీనేటర్ విష్ణువర్దన్ సమక్షంలో దాదాపు 250 మందికి పైగా రక్తపరీక్షలు నిర్వహించారు. దీంతో రక్తపరీక్షలకు స్పందన లభించింది. ఈ సందర్భంగా డిస్ట్రిక్ కోఆర్డీనేటర్ విష్ణువర్దన్ ఆట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గురువారం కూడా ఆర్టీసీ బస్టాండులో ఉచితంగా రక్తపరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

