వాల్మీకీ మహర్షికి జై..!
– తాండూరులో వైభవంగా జయంతి ఉత్సవాలు
– పాల్గొన్న చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మహర్షి వాల్మీకీ దేవాలయం జయ జయ ద్వానాలతో మార్మోగింది. గురువారం తాండూరులో బోయ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వాల్మీకినగర్లో ప్రతిష్టించిన వాల్మీకి దేవాలయంలో మహర్షికి ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, సోమ శేఖర్, రాము తదితరులు హాజరై పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అదేవిధంగా వాల్మీకీ జయంతి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మరోవైపు పలువురు నాయకులు దేవాలయాన్ని సందర్శించి వాల్మీకీ మహర్షికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్య బోయ వాల్మీకీ సంఘం నాయకులు, సంఘం ప్రతినిధులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

