చిరస్మరణీయురాలు ఇందిరమ్మ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

చిరస్మరణీయురాలు ఇందిరమ్మ..!
– తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం
– వర్దంతిలో నివాళులు అర్పించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదల అభ్యున్నతికి కృషి చేసిన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరమ్మ చిరస్మరణీయురాలుగా నిలుస్తోందని తాండూరు కాంగ్రెస్ నాయకులు అభివర్ణించారు. గురువారం పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద ఇందిరమ్మ వర్దంతిని జరుపుకున్నారు. ఇందిరమ్మ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి. బస్వరాజ్, చెన్ మిళ్ల మల్లన్న, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తదితరులు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశంలోని పేదల కోసం ఎన్నో సంక్షమ పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు. పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత ఆమెకు దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తీసుకవచ్చేందుకు పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకులు కావలి సంతోష్, ఎన్. రాజు గౌడ్ (మెకానిక్ ), సయ్యద్ జలాల్, ఖయ్యుమ్ షేక్, భగవాన్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కేవీసీఎస్‌లో దీపావళీ జోష్..!