మిషన్ భగీరథకు అంతరాయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మిషన్ భగీరథకు అంతరాయం..!
– తాండూరులో నీటి సరఫరా బంద్
– ప్రకటించిన అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటింటికి తాగునీరు అందిస్తున్న మిషన్ భగీరథకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో 8వ, 9వ తేదిలలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని ఓ ప్రకటనలో వెల్లడించారు. రాఘవపూర్ నుంచి తాండూరుకు వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ 1000 ఎంఎం డయామీటర్ పైపులైన్ లీకేజీకి గురైన నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు మండలంలో 42 గ్రామాలు, పెద్దేముల్ మండలంలో 35 గ్రామాలకు తాగునీరు సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు. కావున ప్రజలు బోర్లు, ట్యాంకుల నుంచి నీటి అవసరాలను తీర్చుకోవాలన్నారు. నీటిని పొదుపుకగా వాడుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

సర్వే.. సర్వం మోసం..!