కుల సర్వే దేశానికి ఆదర్శం..!
– పేదలందరికి ప్రయోజనాలు
– సర్వేకు అందరు సహకరించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పట్టణంలో సర్వే ప్రక్రియ పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, కుల, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం రెండో రోజు తాండూరు పట్టణం 27వ వార్డులో కొనసాగిన సర్వే ప్రక్రియను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నేతలతో కలిసి పరిశీలించారు. వార్డులోని పలువురు ఇండ్లకు సిక్కర్లు అంటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే ఇంటింటికి వెళ్లి నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అర్హులైన పేదలను గుర్తించి వారికి చెందాల్సిన హక్కులను అందించేందుకు ఈ సర్వే దోహద పడుతుందన్నారు.
ప్రతి ఇంటింటికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించి సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన సర్వే సంక్షేమం, అభివృద్ధిని విమర్శించిందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేకు అందరు సహకరించాలన్నారు. సర్వే సమయంలో అందుబాటులో లేకున్నా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినా తరువాత స్థానిక నాయకుల ద్వారా నమోదు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు సర్వేలో పాల్గొంటున్న అధికారులకు సమగ్ర ప్రాధాన్యత దక్కుతుందని, వారి పాత్ర చరిత్రగా మిగులుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ సాయిపూర్ బాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు డా. సంపత్ కుమార్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బంటు వేణుగొ పాల్, మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్పీలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

