రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం ఎల్మకన్నె గ్రామానికి చెందిన గ్రామ రైతు సమితి అధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు రాజేందర్ రెడ్డి కుటుంబాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. అనారోగ్యానికి గురైన రాజశేఖర్ రెడ్డి ఇటీవలే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బుధవారం ఎల్మకన్నె గ్రామానికి చేరుకున్నారు. రాజశేఖర్ రెడ్డి
తండ్రి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అందుబాటులో ఉండి తమ వంతు సహాకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం అదే గ్రామానికి చెందిన టీన్యూస్ రిపోర్టర్ కృష్ణ కుటుంబ సభ్యులను కూడ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, స్థానిక నేతలు ఉన్నారు.
