పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి
– తాండూరు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– 11వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం 11వ వార్డులో వినాయక దేవాలయం వద్ద సీసీ రోడ్డు పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో మున్సిపల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం జరుగుతుందన్నారు. పట్టణ సమగ్ర అభివృద్ధి చేసి.. తాండూరు రూపురేఖలు మార్చేందుకు శాయశక్తుల పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, రోహిత్, పీఆర్టీయూ నాయకులు నర్సిరెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

