నేరాలు, ప్రమాదాల నియంత్రణపై దృష్టి
– త్వరలో ట్రాఫిక్ పోలీస్టేషన్‌కు టెండర్లు
– సిగ్నళ్ల పునురుద్దరణకు చర్యలు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: నేరాలతో పాటు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. శనివారం సాధారణ తనిఖీలలో భాగంగా తాండూరు పట్టణ పోలీస్టేషన్ ను తనిఖీ చేశారు. ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డితో కలిసి స్టేషన్ లోని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించి.. ఈ యేడాది స్టేషన్ లో ఎన్ని కేసులు నమోదయ్యాయి..? ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయి..? పెండింగ్ కేసులు ఎన్ని అని ఆరా తీశారు. స్టేషన్ లో సిబ్బంది, కొరత వివరాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాండూరు పోలీస్టేషన్ లో కేసుల వివరాలను పరిశీలించడం జరిగిందన్నారు. అక్రమ రవాణా, జూదం, తదితర కేసులు పురోగతిని సమీక్షించడం జరుగుతుందన్నారు. నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
తాండూరుకు మంజూరైన ట్రాఫిక్ పోలీస్టేషన్ ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే స్థలాన్ని గుర్తించి టెండర్లను ఆహ్వానించడం జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో పాటు తాండూరులో ట్రాఫిక్ సిగ్నళ్లను పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగా కొన్ని ప్రాంతాలలో కూడా సిగ్నళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా తాండూరు పోలీస్టేషన్ కు 97 మంది కానిస్టేబుళ్లు రావడం జరిగిందని తెలిపారు. ఇందులో 66 మంది ఏఆర్ విభాగం నుంచి రాగా మిగతా కమ్యూకేషన్ సిబ్బంది వచ్చారని తెలిపారు. మరోవైపు తాండూరులో అక్రమ ఇసుక రవాణాపై పోకస్ పెట్టడం జరిగిందన్నారు.
మైన్స్, రెవెన్యూ నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలింపు చేస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఈ 10 నెలల్లో 85 కేసులు నమోదు చేయడం జరిగిందని వివరించారు. అంతకుముందు పోలీస్టేషన్ ను సందర్శించె ందుకు వచ్చిన ఎస్పీకి స్టేషన్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. స్టేషన్ లో విధులు, కేసుల పరిష్కారంలో కీలకంగా పనిచేసిన కానిస్టేబుళ్లను ఎ స్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐలు, ఏఎస్ఐ. కానిస్టేబుళ్లు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

