తాండూరుకు రూ.12 కోట్ల ఉపాధి నిధులు
– పట్టణంతో పాటు మండలాల వారిగా మంజూరు
– ప్రజా అవసరాలు, సీసీ రోడ్లకు వినియోగం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గానికి రూ. 12 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం ద్వారా మంజూరైనట్లు స్పష్టం చేశారు. తాండూరు పట్టణంతో పాటు మండలాల వారిగా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. తాండూరు మండలానికి రూ.2.75 కోట్లు, యాలాల మండలానికి 2.75 కోట్లు, బషీరాబాద్ మండలానికి రూ.2.75 కోట్లు, పెద్దేముల్ మండలానికి రూ.2.95 కోట్లు, కోట్పల్లి మండలానికి రూ.80లక్షలు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామాలలో ప్రజలకు అవసరమైన పనులు, సీసీ రోడ్లు వేయాలని పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు.
రేపటి నుంచి విజయోత్సవ పర్యటనలు
అదేవిధంగా డిసెంబర్ 1 నుంచి 8వ తేది వరకు ప్రజా పాలనలో భాగంగా విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 1న యాలాల మండలం, 2న తాండూరు మండలం, 3న బషీరాబాద్ మండలం, 4న పెద్దేముల్ మండలం, 5న యాలాల మండలం, 6న తాండూరు పట్టణం, 7న తాండూరు మండలం, 8న పెద్దేముల్ మండలంలో పర్యటించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటేడ్ స్కూల్, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో అధికారులు తప్పక హాజరు కావాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

