అన్నదాన సత్రానికి అంకురార్పణ
– ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– భావిగి భద్రేశ్వర దేవాలయంలో నిర్మాణ పనులు
– ఆలయాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన సత్రంకు అంకురార్పణ జరిగింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సత్రం నిర్మాణ పనులు ప్రారంభించారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భద్రేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ నూతన పునరుద్దరణ కమిటి సభ్యులతో కలిసి స్వామి వారికి పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన సత్రం భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆలయ నూతన చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ భద్రేశ్వర దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
దేవాలయంలో దాసోహ సేవ(అన్నదానం) పనులు చేపట్టేందుకు తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. భక్తులకు అన్నదాన సేవ చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కమిటి సభ్యులు దేవాలయ అభివృద్ధి కోసం దృష్టిసారించాలని సూచించారు. మరోవైపు నూతన కమిటి సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బంటారం లావణ్య, వీరశైవ సమాజం పెద్దలు పటేల్ శ్రీశైలం, వాలి శాంతుకుమార్, లింగదళి రవి, గంగా శ్రావణ్, పరమేశ్వర్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్, నూతన కమిటీ సభ్యులు జాక సంగమేశ్వర్, జొల్లు రోహిణి, శెట్టి సురేష్, గాండ్ల వీరణ్ణ, కల్లూరు బస్వరాజ్, కోటం సిద్ధలింగం, ఎం. ప్రశాంత్ కుమార్, గడ్డి కిరణ్ కుమార్, ఆలయ పూజారులు, వీరశైవ యువదళ్ సభ్యులు, సమాజం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడ చదవండి…

