దేశ రక్షణలో నేవీ కీలకం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

దేశ రక్షణలో నేవీ కీలకం
– తాండూరు న్యాయమూర్తి శివలీల
– కేవీసీఎల్‌లో ఉత్సహాంగా నేవీ డే
– ఆకట్టుకున్న నౌకా దళ విన్యాసాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ రక్షణలో నేవీ వ్యవస్థ ఎంతో కీలకమని తాండూరు సివిల్ జడ్జీ న్యాయమూర్తి శివలీల అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్‌(కేవీసీఎస్)లో నేవీ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి శివలీల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నేవీ వేషాధారణలోని విద్యార్థులు న్యాయమూర్తికి గౌరవ వందనం సమర్పించారు.

నేవీ డే సందర్బంగా విద్యార్థులు నౌకా దళ విన్యాస్యాలను ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి శివలీల మాట్లాడుతూ దేశ రక్షణలో నావికాదళం కీలక భూమిక పోషిస్తుందన్నారు. రక్షణ వ్యవస్థలో నావికాదళం యొక్క ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు. నేవీ సందర్బంగా దేశ భక్తిపై విద్యార్థులు చూపిన ప్రతిభను కొనియాడారు. అదేవిధంగా నేవీ డే ఉత్సవాల్లో విద్యార్థులు ఆకట్టుకునే పిరమిడ్‌లతో రూపొందించిన “చక్ దే ఇండియా”లో అద్భుతమైన నృత్య ప్రదర్శన హైలైట్‌గా నిలించింది.

విద్యార్థులు న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రతిభ పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు దేశభక్తి, సంస్కృతి సంప్రదాయాల విలువలు నేర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, స్కూల్ డైరెక్టర్లు వెంకటేశం, మల్లేశం, సతీష్, టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మున్సిపల్లో దోపడి పాలన..!