సేవా కార్యక్రమాలకు సహకారం
– స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
– ముజ్తబా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ హితం కోసం చేసే సేవా కార్యక్రమాలకు తన వంతు సహాకారం అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలో ముజ్తబా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ స్వచంద సంస్థల సేవలు అభినందనీయమని అన్నారు. ప్రతీ ఒక్కరు సేవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కోరారు. సేవ కార్యక్రమాలకు నావంతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, టీఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, రాజారత్నం, నర్సిరెడ్డి, గోపాల్ అడ్వకేట్, రజాక్, మునిందర్ రెడ్డి, రంగా రెడ్డి, నరేష్ చవాన్, స్వచంద్ధ సంస్థ ప్రతినిధులు అబ్దుల్ ఆహాద్, ముస్తఫా, హమీద్, జునైద్, తహెర్, ఖదీర్, ఇబ్రహీం తదితులున్నారు
