మహిళ రిజర్వేషన్ బిల్లుపై హర్షం

తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళ రిజర్వేషన్ బిల్లుపై హర్షం
– మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
– సాహు శ్రీలత ఆధ్వర్యంలో నిర్వహణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమని తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్, మహిళ మోర్చ వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత అన్నారు. మంగళవారం తాండూరులో సంబరాలు నిర్వహించారు. సాహు శ్రీలత ఆధ్వర్యంలో మహిళలు ప్రధాని మోడి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాహు శ్రీలత మాట్లాడుతూ మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజ్వేషన్ కల్పించేందుకు బిల్లు ప్రవేశ పెట్టడం చారిత్రాత్మకమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బంటారం లావణ్య, తాండూరు పట్టణ అధ్యక్షురాలు ఉమాదేవి, జిల్లా మహిళ మోర్చ ఉపాధ్యక్షురాలు రేణుక, మహిళ మోర్చ అసెంబ్లీ కన్వినర్ అర్చన, కోకన్వినర్ సంగీత, మహిళలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!