కేవీసీఎస్ ఆల్ టైం రికార్డు..!
– జిల్లా టాపర్ గా నిలిచిన స్కూల్ విద్యార్ధిని
– 60 మంది విద్యార్థులకు ఉత్తమ మార్కులు
– వరుసగా విజయ దుందుబీ మోగించిన పాఠశాల
తాండూరు, దర్శిని ప్రతినిధి : పదో తరగతి ఫలితాల్లో తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. వరసుగా పదో తరగతి ఫలితాలలో స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి విజయ దుందుబి మోగించారు. బుధవారం విడుదలైన టెన్త్ రిజల్ట్ లో పాఠశాలకు చెందిన పటేల్ అమ్యూల్య అనే విద్యార్థిని వికారాబాద్ జిల్లా టాపర్ గా నిలిచింది. పాఠశాలలో గత కొన్నేళ్లుడగా స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.

తాజాగా విడుదలైన ఫలితాలలో పాఠశాలకు చెందిన పటేల్ అమూల్య 586/600 మార్కులతో 97.66 శాతంతో జిల్లా టాపర్ గా నిలిచి సత్తా చాటింది. అదేవిధంగా పాఠశాలకు చెందిన జి. తేజస్విని – 582/600(97శాతం), జే.శరణ్య – 579/600(96.5శాతం), సీ. గౌరీ సాయి – 575/600 (95.83శాతం), కార్తిక్ రెడ్డి – 575/600(95.83శాతం), బి. వైష్ణవి – 571/600(95.16శాతం)తో ఉత్తమ ఫలితాలు సాధించారు. దీంతో పాటు పాఠశాలకు చెందిన విద్యార్థులు 560 నుంచి 450 మార్కులు సాధించి ఉత్తీర్ణతను సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యం, ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ తదితరులు మాట్లాడుతూ వరుసగా పదో తరగతి ఫలితాలలో స్కూల్ విజయకేతనం ఎగురవేయడం సంతోషకరమన్నారు. టీచర్ల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహాం, విద్యార్థుల పట్టుదలతో కొన్నేళ్లుగా ఎవ్వరికి సాధ్యం కాని విజయాలను అందుకోవడం జరుగుతుందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

ఇది కూడా చదవండి….

