ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో
– బీసీలకు రాజ్యాధికారం ఖాయం
– రాజ్యసభకు ఎన్నికపట్ల హర్షం
– శుభాకాంక్షలు తెలిపిన రాజ్ కుమార్ కందుకూరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బీసీలకు రాజ్యాధికారం కావడం ఖాయమని సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీజేపీ రాజ్యసభకు ఎన్నిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్. కృష్ణయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ 45 ఏండ్లుగా బీసీ బహుజనుల కోసం ఆర్. కృష్ణయ్య ఎంతో పోరాటం చేస్తున్నారని అన్నారు. ఆయన కృషిని బీజేపీ పార్టీ గుర్తించి రాజ్యసభకు బీజేపీ ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. బీసీల పక్షాన ఆర్.కృష్ణయ్య రాజ్యసభలో గొంతు వినిపిస్తారని అన్నారు. ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బీసీలకు రాజ్యాధికారం రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

రోజుకో బెల్లం ముక్క..!