హనుమంతుని కోసం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హనుమంతుని కోసం..!
– అంతారంలో దేవాలయ పునర్ నిర్మాణానికి దాతల చేయూత
– విరాళాలు అందించేందుకు ముందుకొచ్చిన నేతలు
– రూ. 51 వేలు అందించిన మార్కెట్ కమిటి చైర్మన్
– నగదు, వస్తురూపేణా సహకరిస్తామని పలువురి హామి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం గ్రామంలో పునర్ నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి దేవాలయం కోసం నేతలు, ప్రముఖులు సహకారం అందించేందుకు ముందుకు వస్తన్నారు. గ్రామ పెద్దలు, నేతలు దేవాలయం కోసం చేస్తున్న అభ్యర్థనకు తోడ్పడుతున్నారు. నగదు, వస్తు రూపంలో సహాకారం అందించేందుకు హామి ఇస్తున్నారు. బుధవారం తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి రూ. 51 వేలు అందజేశారు. అదేవిధంగా జి. శ్రీనివాస్ రూ. 25 వేలు అందజేశారు.

తాండూరుకు చెందిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ దేవాలయంలోని గర్భగుడిలో కావాల్సిన సామాగ్రిని అందజేస్తానని హామి ఇచ్చారు. అదేవిధంగా మాజీ వార్డెన్ బీమ్లా నాయక్ దంపతులు ఆలయం వద్ద ఏకశిల ధ్వజస్థంబం ఏర్పాటుకు సహకరిస్తామని అన్నారు. దేవాలయ పునర్ నిర్మాణానికి నె తలు, ప్రముఖులు సహాకారం అందించేందుకు ముందుకు రావడంతో అంతారం గ్రామానికి చెందిన మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివా స్, మాజీ ఎంపీటీసీ శాంతు, ఆలయ కమిటి సభ్యులు పుల్లా ప్రభాకర్ రెడ్డి, సంపత్ కుమార్, కాసుల నారాయణ, పసుల రవి, కేసి కోటప్ప, ప్యాట్ల బాలప్ప, బిశేఖర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. విరాళంతో పాటు సహాకారం అందిస్తామన్నా అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

బోనమ్మ సేవలో రొంపల్లి సంతోష్ కుమార్