పోలీస్ గోల్డ్ చైన్‌ను కొట్టేసిన దొంగ
– క్షణాల్లోనే పరారైన కేటుగాడు
– ఫిర్యాదు చేసిన కానిస్టేబుల్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: పోలీసులు, దొంగలకు అస్సలు పడదు. చాలా సందర్బాల్లో దొంగలు ఒంటిపై డ్రెస్సుతో ఉన్న పోలీసులను చూసి పారిపోతుంటారు. కానీ ఈ దొంగ వైరటీ. ఏకంగా పోలీస్ కానిస్టేబుల్ నుంచే గొల్డ్ చైన్ అపహరించి పారిపోయాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మహేశ్వరం మండలానికి చెందిన రాజశేఖర్ టిఎస్పిఎస్సి మూడవ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం హైదరాబాద్‌లోని సరోజినీ కంటి ఆసుపత్రి వద్ద నుండి మైత్రివనం వెళ్లేందుకు సిటీ బస్సు ఎక్కాడు. అప్పటికే బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉంది. అందులోనే ఉన్న ఓ దొంగ కానిస్టేబుల్ రాజశేఖర్ గొల్డ్ చైన్‌ను కొట్టేశాడు. అనంతరం దిగి చూసేసరికి గోల్డ్ చైన్ కనిపించకపోవడంతో రాజశేఖర్ ఆందోళనకు గురయ్యారు. చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించారు. అయితే దొంగ కానిస్టేబుల్ అని తెలిసే చోరీ చేశాడా.. లేదా తెలియక చేశాడా అనేది తెలియరాలేదు. మరోవైపు అలాగే ప్రయాణ సమయంలో ప్రయాణికులు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, అప్రమత్తంగా లేకపోతే నష్టపోక తప్పదంటూన్నారు సిటీ పోలీసులు.
ఇది కూడా చదవండి…

