– భారీగా తరలివెళ్లిన టీఆర్ఎస్ నాయకులు
దర్శిని ప్రతినిధి, వికారాబాద్ : జిల్లాలోని గులాబీ నేతలంతా హుజూరాబాద్ బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నుంచి ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. దీంతోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా
సీఎం కేసీఆర్ మహాసభ జరగనుండడంతో నేతలు హుజూరాబాద్‌కు బయల్దేరారు. వికారాబాద్‌లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. తాండూరు నియోజకవర్గం నుంచి కూడ వివిధ మండలాల నుంచి నేతలు, కార్యకర్తలు బస్సులు, ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు.
