ఎల్లుండి తాండూరులో ముగ్గుల పోటీలు
– గెలిచిన విజేతలకు నగదు బహుమతులు
– ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎల్లుండి తాండూరులో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నట్లు తాండూరు వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ, కార్యదర్శి మంకాల స్వప్న, కోశాధికారి సింగంశెట్టి శోభలు ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఓపెన్ ఆడిటోరియంలో ముగ్గుల పోటీలు జరుగుతాయని చెప్పారు. పోటీలో పాల్గొనే మహిళలు నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. గంటలోపు ఎలాంటి ముగ్గు అయినా వేయాల్సి ఉంటుందని, ఒకరి సహాకారం తీసుకోవచ్చని, చేతితోనే ఎలాంటి అలంకరణ వస్తువులు లేకుండా ముగ్గును పూర్తి చేయాలన్నారు.
అదేవిధంగా ఈ ముగ్గుల పోటీలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత హాజరవుతున్నారని తెలిపారు. మరోవైపు పోటీలో గెలిచిన విజేతలకు తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పట్టణ ప్రముఖులు సతీష్, తాళ్లపల్లి కవిత రాఘవేంద్రల సహాకారంతో రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల నగదు బహుతిని అందజేయడం జరుగుతుందని, దీంతో పాటు వాసవీ మహిళ సంఘం ఆధ్వర్యంలో మరో 5 మందికి ప్రోత్సహక బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీలలో మహిళలతో పాటు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

