కలెక్టరమ్మకు కోపం..!
– కోవిడ్ టీకా నిర్లక్ష్యంపై మండిపాటు
– వ్యాక్సీనేషన్ లక్ష్యాన్ని నీరుగారిస్తే సస్పెండ్ చేస్తా
– తాండూరులో టీకా ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిఖిల
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిలకు కోపం వచ్చింది. వ్యాక్సీనేషన్ వందశాతం లక్ష్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యాధికారులపై మండిపడ్డారు. అధికారులు, సిబ్బంది మద్య సమస్వయం లేదంటూ ఏకిపారేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే బుధవారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని కన్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్‌ను కలెక్టర్ నిఖిల ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు.
ఈ వాక్సినేషన్ కేంద్రంలో టీకా వేసుకునేందుకు తక్కువ మంది రావడంపై అసహనం వ్యక్తం చేశారు. సెంటర్లలో వాక్సినేటర్లు కూడ లేకపోవడంతో తాండూరు కోవిడ్ టీకా ఇంచార్జి డాక్టర్ భాస్కర్ పై కలెక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాక్సినేషన్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
సాయంత్రం 6 గంటల వరకు ఉండాలని ఆదేశించిన సిబ్బంది నిబంధనలు పాటించడంలేదంటూ మండిపడ్డారు. ఇంచార్జ్, సిబ్బంది మద్య సమన్వయ లోపం కనిపిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు వాక్సినేషన్ చేసుకొని వారిని సూపర్ వైజర్లు వాక్సినేషన్ సెంటర్‌కు తీసుకోవచ్చి వాక్సినేటర్లతో వాక్సిన్ వేయించాలన్నారు. ఈరోజు లక్ష్యం మేరకు తాండూర్ మున్సిపల్ పరిధిలోని 36 వాక్సినేషన్ సెంటర్లలో 3500 మందికి మొదటి, రెండవ డోజ్ వాక్సినేషన్ వేసి అట్టి ఫోటోలను తన మొబైల్ కు పంపించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ కేంద్రానికి వాక్సిన్ వేయించుకునేందుకు వారితో కలెక్టర్ మాట్లాడారు. కుటంబంలో ఇంకా ఎవరైనా వాక్సిన్ వేయించుకొని వారు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. కొందరు వృద్దులు ఉన్నారని తెలుపగా, వరికి కూడా వాక్సిన్ వేయించాలని లేకుంటే వచ్చే ముప్పు వల్ల ప్రమాదం ఏర్పడుతుందని సూచించారు. మరోవైపు అధికారులు కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించి గ్రామాలలో దండోరా వేసి ప్రతి ఒక్కరికి వాహనాలలో వాక్సినేషన్ సెంటర్‌కు తీడుకోరావాలని, ఈ మసాంతం వరకు 100 శాంతం వాక్సినేషన్ పూర్తి చేయాలని కార్యాచరణ చేపట్టినప్పటికి క్షేత్ర స్థాయిలో అనుకునంత వేగంగా పనులు జరుగకపోవడంతో జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ హన్మంత్ రావు, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.
