మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కృష్ణ కుమార్

తాండూరు రాజకీయం వికారాబాద్

మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కృష్ణ కుమార్
– తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చెరుకు రాంచదర్ ఆధ్వర్యంలో ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా అందరు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచెందర్ అన్నారు. సోమవారం ఆయన సమక్షంలో తాండూరు నియోజకవర్గ కమిటిని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తాండూర్ నియోజకవర్గం కమిటీ అధ్యక్షులుగా బి. కృష్ణ కుమార్‌, ఉపాధ్యక్షులుగా బి. శేఖర్, ఎం. రాములు, ప్రధాన కార్యదర్శిగా ఎం. గోవింద్, కే నర్సిములు, కార్యదర్శులుగా లాలప్ప, రాములు, సురేష్, విష్ణు, కోశాధికారిగా నర్సింలు, సలహాదారులు, మల్లప్పలను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ చెరుకు రాంచెందర్‌తో పాటు పలువురు మాట్లాడుతూ మాలల అభ్యున్నత కోసమే పాటుపడాలన్నారు. మాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు వేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న మాల సమస్యలను పరిష్కరించడానికి తోడ్పాటు పడాలన్నారు. మాలల ను ఏకతాటి పైకి తీసుకురాడమే మా లక్ష్యంగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా తాండూరు నూతన కమిటి సభ్యులు రాష్ట్ర నాయకులకు నియోజకవర్గ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

దత్తాత్రేయ స్వామి సన్నిధిలో శంకరన్న..!