ఉత్కంఠభరితంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

క్రీడలు తాండూరు వికారాబాద్

ఉత్కంఠభరితంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
– విజేతగా నిలిచిన పోలీసు జట్టు
– ఒక్క పరుగుతో ఓడిపోయిన ప్రెస్ జట్టు
– అభినందించిన డీఎస్పీ, సీనియర్ జర్నలిస్టులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పోలీసు, ఫ్రెస్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగింది. నూతన సంవత్సరం 2022ను పురస్కరించుకుని పోలీసు, ప్రెస్ జర్నలిస్టుల మద్య ఆదివారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించారు. తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ మైదానంలో ఈ క్రికెట్ మ్యాచ్ కొనసాగింది. ఈ మ్యాచ్ ప్రారంభోత్సవానికి తాండూరు డీఎస్సీ లక్ష్మీనారాయణ, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ చారి, వేణుగోపాల్ రెడ్డి, శెట్టి రవిశంకర్, వాసులు హజరయ్యారు. పోలీసు జట్టుకు తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డి, ప్రెస్ జట్టుకు గోపాల్ (టీవీ5) కెప్టెన్లుగా వ్యవహరించారు.

హోరా హోరీగా మ్యాచ్
ఉత్సహాంగా ప్రారంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన పోలీసు జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. 14 ఓవర్లలో పోలీసు జట్టు 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.
లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ప్రెస్ జట్టు చివరి బంతి వరకు పోరాడింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ప్రెస్ జట్టు చివరి బంతిలో 6 పరుగులు చేయాల్సి ఉండగా 4 నాలుగు పరుగులు చేసింది. దీంతో నిర్ణీత లక్ష్యానికి ఒక్క పరుగు తేడాతో ఓటమి చెంది రన్నర్ గా నిలిచింది. ఉదయం నుంచి సాగిన మ్యాచ్‌లో పోలీసు జట్టులో ఉత్తమ బౌలర్ నర్సింలు, 22 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన నగేష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నిలిచారు. ప్రెస్ జట్టులో ఉత్తమ బ్యాట్స్ మెన్ గా వంశి, ఉత్తమ ఫీల్డర్ రామకృష్ణ(ఆర్కే సాక్షి)లు నిలిచారు. ఈ మ్యాచ్లో అంపైర్లుగా సహరా క్రికెట్ అకాడమి కోచ్లు సతీష్, జగన్నాథ్ రెడ్డిలు వ్యవహరించారు.

ఫ్రెండ్లీ మ్యాచ్‌ల‌తో సమన్వయ భావం: డీఎస్సీ లక్ష్మీనారాయణ
మ్యాచ్ అనంతరం డీఎస్పీ లక్ష్మీనారాయణ సీఐలు జలంధర్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలతో పాటు సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ చారి. వేణుగోపాల్ రెడ్డి, శెట్టి రవిశంకర్ తో కలిసి విజేత, రన్నర్ జట్లకు ట్రోఫీలు అందజేశారు.

ఈ సందర్భంగా డీఎస్సీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఫ్రెండ్లీ మ్యాచ్ సమాజ వాతం’ కోసం పనిచేసే పోలీసు, ప్రెస్ జర్నలిస్టుల మధ్య సమన్వయ భావం పెంపొందుతుందన్నారు. పోటీలో గెలుపోటములను సహజంగా తీసుకొ వాటిని సూచించారు. త్వరలోనే పోలీసు, ప్రెస్ జట్ల మధ్య ఇండోర్ గేమ్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరోవైపు మ్యాచ్లో బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్ కందుకూరి, టీఆర్ఎస్ నాయకులు హరిహరగౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు నర్సింహారెడ్డి, అశోక్, నిరంజన్ స్వామి, జనవాహిణి రాము, టీర వడ్డె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.