కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్లాట పార్టీలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్లాట పార్టీలు..!
– తెలంగాణలో బలమైన పార్టీ బీజేపీ
– స్థానిక సంస్థల్లో సగానికి పైగా సీట్లు కైవసం
– పార్లమెంట్ పరిధిలో రూ.12 కోట్ల మంజూరు
– తాండూరు గిరిజన వసతిగృహా ఘటన బాధాకరం
– చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొట్లాటల పార్టీలుగా మారాయని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం తాండూరుకు వచ్చిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టణంలోని సాయిపూర్ లో ఉన్న ఎస్టీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కొట్లాట పార్టీలుగా మారాయన్నారు. పార్టీ జెండాలతో రోడ్లపై పడి కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ బలమైన పార్టీగా ఎదిగిందన్నారు.

అన్ని ప్రాంతాల్లో సభ్యత్వ నమోదులో పుంజుకుందన్నారు. రైతులు, వృద్ధులు, యువత బీజేపీ వైపు వస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో సర్పంచు, జెడ్పీటీసీలలో అత్యధికంగా సగానికి పైగా సీట్లను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీలో జిల్లా, మండల, ఇతర విభాగాల్లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాలు గెలిచేందుకు సైలెంట్గా పనిచేస్తున్నామని అన్నారు.

మరోవైపు చేవేళ్ల ఎంపీగా పార్లెమంట్ పరిధిలో దాదాపు రూ. 12 కోట్లతో 217 అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో ఏ ఎంపీ చేయని విధంగా రూ. 12 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్ పరిధిలో పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరించడం జరుగుతుందన్నారు.

విద్యార్థులు కోలుకోవడం సంతోషకరం
గత నెలలో వసతి గృహంలో ఉడకని భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వసతి గృహాన్ని సందర్శించినట్లు చెప్పుకొచ్చారు. వంట గది. భోజన శాల, స్నానాల గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు.

విద్యార్థులు, నిర్వహకులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోలు కోవడంతో పాటు వసతి గృహంలో అన్ని శుభ్రంగా ఉంచుకోవడం సంతృప్తి కరమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, సీనియర్ నాయకులు బాలి శివకుమార్, బీఎన్ఎస్ఎల్ కమిటీ సభ్యులు గాజుల శాంతుకుమార్, ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం లావణ్య, నేతలు, హాస్టల్ నిర్వహకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఎలక్ట్రిక్ వాహనాలదే హవా..!