బొంకూరు – బిజ్జారంకు బ్రిడ్జి నిర్మాణంకు కృషి
– అర్హులకు సంక్షేమ పథకాల అమలుకు చొరవ
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం బొంకూరు – బిజ్జారం మధ్య బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పల్లె పల్లెకు ఎమ్మెల్సీ కార్యక్రమం ఆదివారం కొనసాగింది. ఇందులో భాగంగా బొంకూరు, బిజ్జారం గ్రామాలలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో సీసీ రోడ్డు, మురుగు కాలువలు, కల్వర్టు వంటి తదితర సమస్యలను ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు.
దీంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బొంకూరు – బిజ్జారం గ్రామానికి ప్రధాన సమస్యగా మారిన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు. దీంతో పాటు అర్హులకు ఫించన్లు, ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా దృష్టిసారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, తాండూరు మండల కోఆప్షన్ సభ్యులు శంషోద్దీన్, అగ్గనూర్ సర్పంచ్ భీమప్ప, ఎంపీటీసీ వెంకటేష్, మాజీ ఉపసర్పంచ్ వెంకటేష్, నాయకులు పండరి, బిర్కర్ రఘు, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, దత్తూ తదితరులు పాల్గొన్నారు.
కింది వరకు చూడండి…


