తెలంగాణ ప్రజలను మోసం చేసిన సర్కారు
– ఉద్యమ ఆకాంక్షల నెరవేర్పులో విఫలం
– అభివృద్ధి లేని దశాబ్ది ఉత్సవాల బహిష్కరణ
– టీజేఎస్ తాండూరు ఇంచార్జ్ సోమ శేఖర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పోరాటాలు, త్యాగాల ఉద్యమాలతో సాధించున్న తెలంగాణలో బీఆర్ పార్టీ ప్రజలను మోసం చేసిందని తెలంగాణ జన సమితి(టీజేఎస్) పార్టీ తాండూరు ఇంచార్జ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సోమశేఖర్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కడితే అధికారం తరువాత రాజకీయ పార్టీగా మారిందన్నారు. ఉద్యమ కారుల త్యాగాలను అవహేళన చేస్తూ ద్రోహులను పంచన చేర్చుకుని పదవులు కట్టబెట్టిందన్నారు. తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయశంకర్ ఆశయాలు అయిన నీళ్లు, నిధులు, నియామకాలకు అనుగుణంగా కొనసాగకుండా విరుద్ధంగా పాలన చేస్తోందన్నారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో సర్కారు పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించే గొంతులను అణిచివేస్తూ, అక్రమ అరెస్టులతో మేధావుల ద్రోహులుగా చిత్రీకరించడం ఆవమానమే అన్నారు. అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చుకుండా ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా తాండూరు ప్రాంతంలో నూతన పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు, విద్యుత్ రాయితీలు, వృత్తి విద్యా సంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు కందిబోర్డు, జూనియర్ కళాశాలలు, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ నిర్మించడం. అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆసరా ఫించన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి…


