పెండింగ్ టాక్స్‌లపై సీరియస్ యాక్షన్

తాండూరు రాజకీయం వికారాబాద్

పెండింగ్ టాక్స్‌లపై సీరియస్ యాక్షన్
– మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు
– తాండూరులో పన్ను చెల్లించని దుకాణం సీజ్
– ప్రజలు ఆస్తి పన్నులు చెల్లించాలి: కమీషనర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో పెండింగ్లో ఉన్న ఆస్తిపన్నులు వసూలు చేసేందుకు అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తాండూరు మున్సిపల్ ఆస్తిపన్నుల వసూళ్లలో వెనుకబడడంతో అధికారులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. పట్టణంలో మొండి బకాయిదారులకు గురువారం నుంచి రెడ్ నోటీసులు జారీ చేశారు. ఈ రెడ్ నోటీసులు అందుకున్న ప్రజలు నిర్ణీత కాలంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుందని మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు.

పన్నులు చెల్లించకపోతే వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కావున పట్టణ ప్రజలు తమ ఆస్తి పన్నులను వెంటనే చెల్లించి అధికారులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా గురువారం నిర్వహించిన ఆస్తిపన్నుల వసూళ్లలో పట్టణంలోని ఓప్రాంతానికి చెందిన వ్యాపారి డబ్బులు చెల్లించకపోవడంతో అతని దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వ్యాపారి పన్నులను చెల్లించేందుకు ముందుకు వచ్చారు. దీంతో అధికారులు అతని దుకాణానికి సంబంధించి తాళాలను తిరిగి అప్పగించారు.

ఇదికూడా చదవండి…

షిర్డీ సాయినాథుని సన్నిధిలో ప్రభాకర్ గౌడ్