కార్మికులకు కోపమొచ్చింది..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కార్మికులకు కోపమొచ్చింది..!
– టైలర్ షాపు ముందు చెత్త పడేసిన వైనం
– సీసీ పుటేజీలో కార్మికుల విడియో రికార్డు
– తాండూరులో వివాదాస్పదమైన తీరు
– ఇలా చేయడం వెనుక షాకింగ్ నిజాలు..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ యజమానికి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని మున్సిపల్ కార్మికులకు వచ్చిన కోపాన్ని వినూత్న రీతీలో తెలియజేశారు. రాత్రి వేళ టైలరింగ్ షాపులో పేరుకుపోయిన చెత్తను యజమాని సమీపంలో ఉన్న చెత్త కుప్ప వద్దకు తీసుకెళ్లి పడేశారు. తిరిగి తెల్లవారు జామున చెత్త సేకరణకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు ఆ చెత్తను తీసుకెళ్లి తిరిగి టైలరింగ్ షాపు షెటర్ వద్ద పడేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో ఈ సంఘటన వివాదాస్పద చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… తాండూరు పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఓ టైలరింగ్ షాపు కొనసాగుతోంది. ప్రతి రోజూ షాపులో పేరుకుపోయిన చెత్తను యజమాని లేదా పనివాళ్లు ఆ చెత్తను తీసుకెళ్లి కొద్ది దూరంలో ఉన్న బహిరంగ చెత్త కుప్పలో పడేస్తున్నారు.

రోజూ మాదిరిగానే గురువారం రాత్రి పనిముగిసిన తరువాత షాపులో చెత్తను చెత్త కుప్ప వద్ద పడేసి వెళ్లిపోయారు. శుక్రవారం షాపు వద్దకు వచ్చిన యజమానికి షెటర్ వద్ద రాత్రి కుప్పలో పడేసిన చెత్త పేలుకలు తిరిగి షాపు వద్ద దర్శనమివ్వడంతో ఖంగుతిన్నాడు. సీసీ కెమెరాలను పరిశీలించగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పడేసి వెళ్లిపోయినట్లు వీడియో రికార్డు అయ్యింది. ఈ సంఘటనపై షాపు యజమాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానికంగా చోటు చేసుకున్న సంఘటనతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పారిశుద్ధ్య కార్మికులు వ్యవహరించిన తీరుపై చర్చించుకున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులను వివరణ కోరగా ప్రతి రోజూ చెత్తను బహిరంగ ప్రదేశంలో వేయకుండా చెత్త వాహనాలకు అందించాలని యజమానికి కార్మికులు సూచించట్లు తెలిపారు. అయినా కూడా యజమాని వినకుండా బహిరంగ ప్రదేశంలో వేస్తున్నారని, అతినికి గట్టిగా గుణపాఠం చెప్పేందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందని వెనుకవేసుకుని రావడం గమనార్హం.

ఇదికూడా చదవండి…

దర్శిని ఎఫెక్ట్…!