దర్శిని ఎఫెక్ట్…!

తాండూరు రాజకీయం వికారాబాద్

దర్శిని ఎఫెక్ట్…!
– సుందరంగా సేవాలాల్ విగ్రహ ప్రాంగణం
– పనులు చేయించిన మున్సిపల్ అధికారులు
– సంతోషం వ్యక్తం చేసిన గిరిజనులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బంజారుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ సాక్షిగా నిర్లక్ష్యం అనే దర్శిని న్యూస్ కథనానికి స్పందన లభించింది. గంటల్లోనే అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేయించారు. పట్టణంలోని బాలాజీ హస్పిటల్ సమీపంలో ఉన్న సేవాలాల్ విగ్రహం వద్ద అపరిశుభ్రత ఏర్పడిందని కథనం రావడం జరిగింది. నిజానికి విగ్రహం వద్ద అదే పరిస్థితి ఉండడంతో పలువురు గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల దైవం సేవలాల్ పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.

ఇదే విషయంపై దర్శిని న్యూస్‌లో కథనం రావడంతో స్థానిక మున్సిపల్ అధికారులు స్పందించారు. గంటల పాటు విగ్రహం వద్ద పారిశుద్ధ్య పనులు చేయించారు. విగ్రహం పరిసర ప్రాంతాలలను జేసీబీ యంత్రాలతో చదును చేయించారు. మురుగు కాలువను మూయించి దుర్గందం లేకుండా చర్యలు తీసుకున్నారు. అధికారులు స్పందించడం పట్ల పట్ల భూకైలాస్ వ్యవస్థాపకులు వాసు పవార్ నాయక్ సంతోషం వ్యక్తం చేశారు. వాసుపవార్‌ నాయక్ తో పాటు అంతారం తాండా మాజీ సర్పంచ్ రాంచందర్ మున్సిపల్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రేపు శనివారం జరిగే సేవాలాల్ జయంతిలో పార్టీలకతీతంగా అన్ని గిరిజన సంఘాల నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

సేవాలాల్‌ సాక్షిగా నిర్లక్ష్యం..!