సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే

తాండూరు రాజకీయం వికారాబాద్

సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే
– ఆమె స్ఫూర్తితో అందరూ ఆదర్శంగా నిలవాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
– వర్ధంతి సందర్భంగా నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల చైతన్యం కోసం ఉద్యమించిన సావిత్రిబాయి పూలే సామాజిక ఉద్యమ కార్మిక నిలిచారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే వర్ధింతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి రాజ్ కుమార్ తో పాటు పలువురు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు, బహుజన బిడ్డలు చదువుకోవాలని సావిత్రిబాయి పూలే ఉద్యమించారని అన్నారు. మహిళల్లో సామాజిక చైతన్యం నింపేందుకు కృషి చేశారని అన్నారు. ఆమె స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవాలన్నారు. మరోవైపు మహిళలపై ఆకృత్యాలు పెరుగుతుండడం చాలా బాధాకరమైన అంశం అందుకని, స్త్రీల కోసం మరిన్ని చట్టాలు రావాలని ముఖ్యంగా చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సత్యానంద కుమార్, ఉపాధ్యాయులు నాగేశ్వర్ చారి, రవీందర్ రెడ్డి, వీరన్న, నర్సింలు, అంజిలప్ప, శ్రీకాంత్ రెడ్డి, స్వప్న, భవాని, మంజుల, జహీరుద్దీన్, ప్రశాంత్, బీసీ సంఘం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్, కళాశాల విద్యార్థులు, విద్యార్థినిలు బీసీ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.