ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి..
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఈ దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం దీపావళి పర్వదినం సందర్భంగా ఆయన తాండూరు నియోజకవర్గ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియ జేశారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి అని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని.. చిన్నపిల్లలు కాకరొత్తులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అందరికి శుభం చేకూరాలని , సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.


