నయూంఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ
– సలీంఖాన్ భౌతిక ఖాయానికి నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, రియల్టర్ నయూం ఖాన్ కుటుంబాన్ని పరామర్శించారు. గురువారం నయూంఖాన్ సోదరుడు సలీం ఖాన్ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నయూం ఖాన్ నివాసానికి చేరుకుని సలీంఖాన్ భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి ప్రకటించారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ సీనియర్ కరణం పురుషోత్తము, పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రావుఫ్, డీపీసీ మాజీ సభ్యులు పట్లోళ్ళ నర్సింహులు, ఎంఐఎం అధ్యక్షులు అబ్దుల్ హది, మైనార్టీ నాయకులు అయూన్ ఖాన్, ఖయ్యూం ఖాన్, తదితరులు ఉన్నారు.



