నిర్లక్ష్యానికి పరాకాష్ట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నిర్లక్ష్యానికి పరాకాష్ట..!
– మళ్లీ వృథాగా పారిన మిషన్ నీళ్లు
– చిన్న గోదారిగా మారిన కాలేజీ మైదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ సంఘటన. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ మైదానంలో మళ్లీ మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పారాయి. గత రెండు రోజుల క్రితం కాలేజీ మైదానంలో ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు నుంచి నీళ్లు వృథాగా వెళ్లాయి.

ట్యాంకు వద్ద పైపులైన్ లీకేజీ వల్ల గంటల పాటు నీళ్లు వృథాగా పారాయి. అప్పటి నుంచి అధికారులు పైపులైన్ లీకేజీలకు మరమ్మత్తులు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆదివారం మరోసారి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం చిన్నపాటి గోదారిగా మారింది. ఉదయం నుంచి సుమారు గంట పాటు మళ్లీ మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పారాయి. నీటి ఎద్దడి తరుణంలో మళ్లీ తాగునీరు వృథాగా పారడంతో పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

వివాహా వేడుకలో పాల్గొన్న శంకర్ యాదవ్