వివాహా వేడుకలో పాల్గొన్న శంకర్ యాదవ్
– నూతన వధూ వరులకు ఆశీర్వాదం
తాండూరు దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలోని వెంకోబా గార్డెన్లో జరిగిన వివాహా వేడుకలో ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ పాల్గొన్నారు. ఆదివారం వెంకోబా గార్డెన్లో శంకర్ యాదవ్ వద్ద పనిచేసే సురేష్ పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు శంకర్ యాదవ్ కుటుంబ సమేతంగా, మిత్ర బృందంతో కలిసి హాజరయ్యారు. వేద మంత్రాల సాక్షిగా ఒక్కన నూతన వధూ వరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాములు యాదవ్, నేతలు బంటు మల్లప్ప, మదన సింహారెడ్డి, మల్ రెడ్డి, బావనోళ్ల కిరణ్ కుమార్ యాదవ్, జొన్నల వినోద్ కుమార్ తదతరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

