ఫోన్ పే, జీ పేలకు యూపీఐ సేవలు క్యాన్సల్..!

జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

ఫోన్ పే, జీ పేలకు యూపీఐ సేవలు క్యాన్సల్..!
– ఆ నెంబర్లకు మాత్రమే ఏప్రిల్ 1నుంచి రద్దు
– ప్రకటించిన నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా
దర్శిని డెస్క్: వచ్చేనెల ఏప్రిల్ 1నుంచి ఫోన్ పే, జీ పేలలకు యూపిఐ సేవలను రద్దు చేస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్‌ ఇండియా(ఎన్పీసీఐ) ప్రకటించింది. ఇటీవ‌లే బ్యాంక్ ఖాతాకు లింక్ చేయని లేదా మార్చబడిన మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలు నిలిపివేస్తున్న‌ట్లు ఎన్‌పీసీఐ తీసుకున్న నిర్ణ‌యం ఇదవరకే తీసుకుంది.

దీంతో ఫోన్‌ నెంబర్లు చాలా కాలం పాటు పనిచేయకుండా ఇన్‌యాక్టివ్‌గా ఉంటే వాటికి అనుసంధానంగా ఉన్న గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటి పేమెంట్‌ యాప్స్‌ సేవలు కూడా రద్దు కానున్నాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ తెలిపింది.

లావాదేవీలు బంద్
కొందరు తమ మొబైల్‌ నంబర్‌ను మార్చినా.. బ్యాంకుల్లో, యూపీఐ యాప్‌లలోనూ మార్పు చేయడం లేదు. ఇలా వినియోగంలో లేని/నిష్క్రియా నంబర్లతో ఉన్న యూపీఐ ఐడీలను ఆపేయాలని సంబంధిత సంస్థలకు ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. రెగ్యుల‌ర్‌గా వాడే ఫోన్ నెంబ‌ర్ కాకుండా.. ఎప్పుడో తీసుకున్న నంబర్‌తో బ్యాంక్ అకౌంట్ ఉన్నా, పేమెంట్‌ యాప్‌లలో ఆ నెంబ‌ర్‌ను లింక్ చేసినా.. యూపీఐ ఐడీలు అదే నంబర్‌తో ఉంటాయి. ఐతే ఆ నెంబ‌ర్‌ను వాడ‌క‌పోవ‌డంతో టెలికాం సంస్థ‌లు ఆ నెంబ‌ర్లను బ్లాక్ చేయ‌డ‌మో, లేదా ఇత‌రుల‌కు కేటాయించ‌డమో జ‌రుగుతుంది. కానీ ఆ నెంబ‌ర్‌పైనే యూపీఐకు లింక్ అయి ఉంటుంది. అప్పుడు యూపీఐ లావాదేవీలు కూడా జ‌ర‌గ‌వు.

జరిగేది ఇదే…
మొబైల్‌ నంబర్‌ను మార్చినా.. బ్యాంకు ఖాతాలో కొత్తది నమోదు చేయించకుండా, పాత నంబర్‌నే ఉంచిన వారిపై ప్ర‌భావం ప‌డుతుంది. మీ బ్యాంక్ లావాదేవీల విష‌యాలు ఇత‌రుల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. గత 90 రోజులుగా ఎలాంటి కాల్స్, మెసేజ్‌లూ రాని నంబరు కలిగి ఉన్నవారు. టెలికాం సంస్థలు ఇతరులకు కేటాయించిన నంబర్లనే యూపీఐ వద్ద ఉంచిన వారు. మొబైల్‌ నంబరును కంపెనీకి స్వాధీనం చేసినప్పటికీ, బ్యాంకులో వివరాలు చెప్పని వారికి యూపీఐ సేవలు ఆగిపోయే అవకాశం ఉంది.

ఈ నిర్ణయం ఎందుకో తెలుసా
ఇలాంటి ఫోన్‌ నెంబర్లను వినియోగించి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ప్ర‌స్తుత కాలంలో సైబర్‌ నేరాలు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఫోన్ నెంబ‌ర్ల‌కు ఓటీపీలు, లింక్‌లు పంపి.. ఆ వివ‌రాల‌ను చెప్ప‌గానే బ్యాంక్ అకౌంట్లో డ‌బ్బులు మాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నిష్క్రియా మొబైల్‌ నంబర్లను టెలికాం సంస్థలు ఇతరులకు కేటాయించినప్పుడు, ఆ నంబరుకు అనుసంధానమైన యూపీఐ ఐడీల ద్వారా మోసాలు జరగొచ్చని ఎన్‌పీసీఐ గుర్తించింది.

ఇదికూడా చదవండి…

‘కోత’ల సర్కారుగా కాంగ్రెస్..!