గంజ్ వ్యాపారస్తుల దాతృత్వం…!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

గంజ్ వ్యాపారస్తుల దాతృత్వం…!
– చిన్నారి వశిష్ట ఆపరేషన్ కోసం ముందుకు
– బాలుడి కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సాయం

తాండూరు, దర్శిని ప్రతినిధి : అరుదైన కాలేయ వ్యాధితో ఆపదలో చిన్నారిని ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు తాండూరు గంజ్ వ్యాపారులు ఏకమయ్యారు. తమ వంతు సాయంగా చిన్నారి కుటుంబానికి రూ. 25వేల ఆర్థిక సాయం అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే… యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన శివకుమార్, భానుప్రియల 10నెలల కుమారుడు వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. బాలుడికి కాలేయ మార్పిడి చేయాలని, ఈ ఆపరేషన్ కోసం సుమారు రూ. 23లక్షలు అవసరమని వైద్యులు తేల్చారు. పేదరికంలో ఉన్న దంపతులు దాతల ఆర్థికం సాయం కోరారు. తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి స్పూర్తితో ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి తమవంతు ఆర్థిక సాయాలను అందించారు. ఇప్పటి వరకు సుమారు రూ. 16లక్షల వరకు సాయం అందగా ఆపరేషన్ కోసం ఇంకా కొన్ని లక్షలు అవసరమయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న తాండూరు గంజ్ అసోసియేషన్ స్పందించి బాలుడి కోసం తమవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. మంగళవారం రాత్రి అసోసియేషన్ అధ్యక్షులు వెంకట రాములుగౌడ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్‌ కుమార్‌లు అసోసియేషన్ అందరి సభ్యుల సమక్షంలో బాలుడి తండ్రికి రూ. 25వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్నారికి శస్త్ర చికిత్స విజయవంతగా జరగాలని, క్షేమంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సీనీయర్ సభ్యులు పటేల్ శ్రీశైలం, రాంరెడ్డి, సల్లా దామోదర్, బంటారం సుధాకర్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, సభ్యులు, వ్యాపారులు, పెద్దలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఘనంగా ఇఫ్తార్ విందు