సామాజిక శక్తి బాబు జగ్జీవన్ రామ్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సామాజిక శక్తి బాబు జగ్జీవన్ రామ్..!
– ఆయన బాటలో నడిచి న్యాయాన్ని సాధిద్దాం
– తాండూరులో భవనానికి రూ.10లక్షలు నిధులు
– తెలంగాణ రాష్ట్ర చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి
– జయంతిలో నివాళులు అర్పించిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బడుగు బలహీనవర్గాలతో పాటు దళిత హక్కుల కోసం పోరాడిన సామాజిక శక్తి భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ సామాజిక శక్తి అని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అభివర్ణించారు. శనివారం తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని జగ్జీవన్ రామ్ భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలకు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి హాజయరయ్యారు.

ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మహేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడుగా, దేశానికి ఉప ముఖ్యమంత్రిగా జగ్జీవన్ రామ్ అందించిన సేవలు మరువలేనివి అని అన్నారు. దళిత హక్కుల కోసం పోరాడి అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. సామాజిక సమానత్వంపై అందరిని చైతన్య పరిచిన సేవామూర్తి అని కొనియాడారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రిగా జగ్జీవన్ రామ్ భారత జాతి కోసం చేసిన సేవలు, తీసుకవచ్చిన సంస్కరణలు మరువలేనివన్నారు.

అందుకే బాబు జగ్జీవన్ రాము సామాజిక శక్తి అని అభివర్ణించారు. అదేవిధంగా తాండూరులో అసంపూర్తిగా ఉన్న జగ్జీవన్ రామ్ భవన నిర్మాణానికి రూ. 10లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిఆపరు. అంతకుముందు పట్టణంలోని తన నివాసంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. చీఫ్ వీప్ తో పాటు టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తం రావు, మాజీ కౌన్సిలర్లు పరిమళ రవీందర్, అబ్దుల్ ఖవి తదితరులు కూడా నివాళులు అర్పించారు.

నివాళులు అర్పించిన నాయకులు
మరోవైపు రైల్వే స్టేషన్ సమీపంలోని జగ్జీవన్ రామ్ భవన్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలో పలువురు నాయకులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులు డా. సంపత్ కుమార్ తదితరులు హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు ఆనంద్. అంజిలప్ప, ఆశప్ప, సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ యాలేటి శ్రీనివాస్, యువనాయకులు కేశవులు, భగవాన్, బిర్కడ్ రఘు, శివానంద్, అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

రారండోయ్.. రాములోరి గుడికి..!