కోటబాస్పల్లిలో శ్రీరామ నవమి సంబురం
– అంగరంగా వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం
– పాల్గొన్న నర్సింహారెడ్డి(బాబు) దంపతులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామం శ్రీరామ నవమి సంబరంలో మునిగింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా కోటబాస్పల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి సోదరుడు, తాండూరు సీటీకేబుల్ ఎండి గొట్టుగ నర్సింహారెడ్డి(బాబు), సుశ్మితారెడ్డి దంపతులు సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగలా నిర్వహించారు.

అంతకుముందు సీతారాములను ఊరేగింపుగా దేవాలయానికి బాజా భజంత్రీల మద్య తీసుకవచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణ మద్య సీతారాముల కళ్యాణోత్సవాన్ని జరిపించారు. కళాణోత్సవాన్ని తరలివచ్చిన భక్తులు సీతారాముల పెండ్లిని చూసి పులకించారు. జయ జయ ద్వానాలతో శ్రీరాముని నామ స్మరణతో దేవాలయం మార్మోగింది. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజశేఖర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి మాజీ సర్పంచ్ కురువ నాగార్జున, పీఆర్టీయూ నాయకులు నాగప్ప, కిష్టప్ప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

