– రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన వైనం
దర్శిని ప్రతినిధి, మహబూబాబాద్: లంచం తీసుకుంటూ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబట్టడారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటు చేసుకుంది. జిల్లా షెడ్యూల్ కులాల అధికారి రావూరి రాజు మండలంలోని హాస్టల్ వార్డెన్ బాలరాజు సస్పెన్షన్ కాలం బిల్లులు చెల్లించేందుకు రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అంత డబ్బు చెల్లించలేక ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. మధ్యవర్తిగా ఆ ఆఫీస్ వాచ్‌మెన్ గురుచరన్ ద్వారా రూ. 2 లక్షల నగదును ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. సోమవారం సాయంత్రం ఈ డబ్బును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
