వివేకానందుని స్పూర్తి కొనసాగించాలి
– బీవీజీ ఫౌండేషన్ చైర్మన్, మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్
– ఫౌండేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వామి వివేకానందుని స్పూర్తిని అందరు కొనసాగించాలని తాండూరు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్ అన్నారు. బుధవారం బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159న జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సునితాసంపత్‌తో పాటు పలువురు స్వామి వివేకానంద చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు, స్వామి వివేకానందుని జీవితానికి సంబంధించి పుస్తకాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానందుని స్పూర్తిని అందరు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వివేకానందుడు సూచించిన విధంగా యువత అభ్యున్నతికి కోసం బీవీజీ ఫౌండేషన్ తరుపున కార్యక్రమాలను చేపడుతామని అన్నారు. ఈకార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు లింగదలి రవికుమార్, శ్రీనివాస్, సమితి సభ్యులు పర్యాద రామకృష్ణ, అంతారం కిరణ్, సర్పంచ్ శివ, ఫౌండేషన్ సభ్యులు మహేష్ ఠాకూర్, అంకిత్ అనురాగ్. నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

