మూడో రోజు 80 కిలో మీటర్లు
– తిరుమలగుట్టకు చేరిన స్వాముల పాదయాత్ర
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నుంచి శబరిమలైకి చేపట్టిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర భక్తి శ్రద్దలతో కొనసాగుతోంది. ఈనెల 5వ తేది నుంచి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి స్వాములు పాదయాత్ర
చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్రలో ఆలయ కమిటి ఆధ్వర్యంలో వరాల శ్రీనివాస్ రెడ్డి(కౌన్సిలర్), పట్లోళ్ల గంగాధర్, సంపల్లి శ్రీను, పట్లోళ్ల ప్రశాంత్, గోపాల్ గురు స్వామి, వరంగల్ అశోక్ గురు స్వామి, రాము, శ్రీనివాస్ రెడ్డి, చంద్రు, రుద్రు పటేల్, బస్వరాజ్, అజయ్, సునీల్, సందీప్ రెడ్డి తదితరులు శబరికి పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. శుక్రవారం, శనివారం, ఆదివారం మూడో రోజు వరకు పాదయాత్ర కొనసాగింది. ఆదివారం మహబూబ్ నగర్లోని తిరుమల గుట్ట వద్ద ఏర్పాటు చేసిన విడిది వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ మణికంఠుని చల్లని కరుణతో ఎలాంటి విఘాదాలు లేకుండా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. శబరి పాదయాత్రకు భక్తుల నుంచి స్పందన లభిస్తోందని అన్నారు. 37 రోజుల పాటు కొనసాగే పాదయాత్రలో మూడు రోజులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 1200 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటామని తెలిపారు.

