సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
– వ్యాపారులకు, దుకాణదారులకు నోటీసులు
– అవగాహన కల్పించిన తాండూరు పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల అదుపు సాధ్యమవుతందని, కావున వ్యాపారులు, దుకాణాదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తాండూరు పట్టణ పోలీసులు సూచించారు.

శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ సూచనలతో పోలీసు సిబ్బంది పట్టణంలో వైన్స్ షాపులు, హోటళ్లు, స్కూళ్లు, రెస్టారంట్లు, ఫంక్షన్ హాల్స్, కాలేజీలు, ఆసుపత్రులు తదితర వాణిజ్య దుకాణాదారులకు నోటీసులు అందజేశారు.

సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాలు దోహదపడతాయని పోలీసులు వ్యాపారులు, నిర్వహకులకు సూచించారు. కావున ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి….

