రేపే ఇంటర్ రిజల్ట్..!
– విడుదల ఎన్ని గంటలకంటే..
– ఫలితాలు ఎలా చూసుకోవాలంటే..?
హైదారాబాద్, దర్శిని ప్రతినిధి : రేపు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య తాజాగా ఫలితాల విడుదల తేదీ, సమయం ఖరారు చేశారు. నాంపల్లిలోని విద్యాభవన్లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా ఇంటర్ ఫీలితాలు ప్రకటించనున్నారు.

మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫీలితాలు ప్రకటించనున్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లి దండ్రులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్సైట్ సందర్శించి ఫలితాలను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐవీఆర్ పోర్టల్ 9240205555 ఫోన్నంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు సైతం అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను అధికారులు మంగళవారం ఫలితాలు విడుదల అనంతరం వెల్లడిస్తారు. అనంతరం ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులకు నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదికూడా చదవండి…

