తాండూరు గులాబీ శ్రేణుల్లో జోష్..!
– బీఆర్ఎస్ రజతోత్సవం సభకు సన్నద్దం
– అన్ని గ్రామాల్లో వరంగల్ సభ వాల్ పోస్టర్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో జోష్ నిండుకుంది. ఈనెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు సన్నద్దం అవుతున్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో పెద్ద ఎత్తున చలో వరంగల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

పార్టీ నేతలు, కార్యకర్తలు నూతనోత్సహంలో ప్రతి ఊరు, ప్రతి వాడలో వాల్ పోస్టర్లను అంటిస్తూ కార్యకర్తలకు రజతోత్సవ సభకు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి గ్రామంలో గులాబీ జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండగలా జరుపుకోవాలని సూచించారు. ఈ మేరకు పార్టీ నేతలు, శ్రేణులు అందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దీంతో పాటు ఈనెల 27న వరంగల్‌లో జరిగే సభకు భారీ ఎత్తున తరలివేళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. దీంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో సందడి ఏర్పడింది.
ఇదికూడా చదవండి…

