ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు
– ఎంసెట్ ఉచిత కోచింగ్ అభినందనీయం
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంసెట్ అభ్యర్థుల కోసం నిర్వహించిన ఉచిత ఎంసెట్ కోచింగ్ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఉన్నత చదువులకు ఎంత కష్టపడ్డారో వివరించారు. ఇందుకు స్పూర్తి నింపిన మేధావుల ఆలోచనలను పంచుకున్నారు. ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కావున విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదివి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. తాండూరు ప్రాంతంలోని పేద విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ అందించిన నిర్వహకులను సబ్ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనీయర్ నాయకులు అబ్దుల్ రవూఫ్, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, కార్యదర్శి యూనుస్, కోశాధికారి మహమ్మద్ సిరాజోద్దీన్, అబ్దుల్ ఖవి, అబ్దుల్ సలీం, బాసిత్ అలీ, ఖాలీద్ సైపుల్లా, వసీం అక్రమ్, ముక్రమ్, అధ్యాపకులు తులసీదాస్, పర్యాద రామకృష్ణ, వెంకటలక్ష్మీ, ప్రియాంక, అజయ్ కుమార్, జ. వెంకట్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

తాండూరు గులాబీ శ్రేణుల్లో జోష్‌..!