ఆర్బీఓఎల్ ఉద్యోగుల ఔదార్యం..!
– చిన్నారి వశిష్ఠ కోసం ఒకరోజు వేతనం
– రూ. 1 లక్ష అందించిన ఉద్యోగులు
– అభినందించిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఔదార్యాన్ని చాటుకున్నారు. యాలాల మండలం సంగెంకు చెందిన భానుప్రియ, శివకుమార్ల కుమారుడు వశిష్ట(10నెలలు) ఆరుదైన కాలేయ వ్యాధి చికిత్స కోసం ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.

ఇందుకోసం ఉద్యోగులంతా తమ జీతంలో ఒక్కరోజు వేతను వదులుకుని డబ్బులు జమ చేశారు. మొత్తం రూ. 1 లక్ష జమ చేసి మంగళవారం ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్నారి వశిష్ఠ చికిత్సకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన పిలుపు మేరకు ఉద్యోగులు ఒక్క రోజు వేతనం అందించేందుకు ముందుకు రావడం పట్ల వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో విద్యావేత్త పర్యాద రామకృష్ణ, ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఉన్నారు.

ఇది కూడా చదవండి….

