ఇంటికే ముటేషన్లు
– తాండూరు మున్సిపల్లో వినూత్న కార్యక్రమం
– రేపటి నుంచి వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్
– స్వయంగా అందించనున్న ఆర్డీఓ అశోక్ కుమార్
తాండూరు, దర్శని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో పెండింగ్ ముటేషన్లకు మోక్షం లభించింది. అయితే ఈ ముటేషన్లను లబ్దిదారుల ఇంటికి వెళ్లి అందించనున్నారు. వినూత్నంగా ప్రారంభించున్న ఈ కార్యక్రమం రేపు బుధవారం నుంచి వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించున్నారు. మంగళవారం ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్
అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తాండూరు మున్సిపల్‌లో గతంలో 300ల వరకు ముటేషన్లు, అసెస్ మెంట్‌లను పరిష్కరించడం జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దాదాపు 110 ముటేషన్, అసెస్‌మెంట్‌లను పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రేపటి నుంచి వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ద్వారా ఇంటింటికి వెళ్లి అందించడం జరుగుతుందని స్పష్టంచేశారు. రేపు వార్డుల్లో పర్యటించి నేరుగా లబ్దిదారులకు అందజేస్తామని తెలిపారు. ఇందులో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు వచ్చే సోమవారం నాటికి మున్సిపల్‌లోని అన్ని విభాగాలను కొత్త మున్సిపల్‌కు తరలిస్తామని, అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తామని పేర్కొన్నారు.
