గ్రేట్ డా. సంపత్ సార్..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రేట్ డా. సంపత్ సార్..!
– గర్భిణీ ప్రసవం కోసం రక్తదానం
– 161వ సారి రక్తదానం చేసిన దాత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, బాలాజీ ఆసుపత్రి అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. గర్భిణి ప్రవసం కోసం రక్తం అవసరం ఏర్పడడంతో జిల్లా ఆసుపత్రికి చేరుకుని 161వ సారి రక్తదానం చేశారు.

కోడంగల్ మండలం టేకులకోడ్ గ్రామానికి చెందిన తెలుగు విజయ్ కుమార్ భార్య అంబిక నిండు గర్భిణీగా ఉంది. బుధవారం ప్రసవం జరగాల్సి ఉంది. అయితే ఆమెకు రక్తం తక్కువగా ఉందని కుటుంబీకులు రక్తదాత కోసం ఎదురు చూశారు. ఈ విషయం తెలుసుకున్న డా. సంపత్ కుమార్ స్వయంగా తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని గర్భిణీ ప్రసవం కోసం రక్తదానం చేశారు. దీంతో కుటుంభీకులు డా. సంపత్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తాండూరులో అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా డా. సంపత్ కుమార్ పేరు గాంచారు. తాజాగా 161వ సారి రక్తదానం చేసి గ్రేట్ అని అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జంటుపల్లి వెంకట్, యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు.

ఇది కూడా చదవండి….

శభాష్.. పట్లోళ్ల సాహిత్ రెడ్డి..!