రేపు విద్యుత్ అంతరాయం

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు విద్యుత్ అంతరాయం
– ప్రకటించిన విద్యుత్ అధికారులు
– కరెంట్ ఉండని ప్రాంతాలు ఇవే
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రతి యేడాది మాదిరిగానే వర్షాకాలం ముందు విద్యుత్ మరమ్మత్తులు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రేపు తాండూరు మండలంలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు తాండూరు డీఈ బాను ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

తాండూరు మండలంలోని కరణ్ కోట్ 33 కేవీ ఫీడర్ మరమ్మత్తులతో పాటు విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల తొలగింపు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా శనివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12-30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

షరతుల్లేకుండా సబ్సీడీ రుణాలు ఇవ్వాలి