క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– నియోజకవర్గ క్రైస్తవులతో క్రిస్మస్ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం తాండూరు పట్టణంలో నియోజకవర్గంలోని క్రైస్తవులకు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.

అంతారం రోడ్డు మార్గంలోని మెట్రో ఫంక్షన్ హాల్లో తెలంగాణ మైనార్టీ క్రిస్టియన్ చైర్మన్ అంకిత్ అనురాగ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవుల సమక్షంలో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏసుప్రభు శాంతికి ప్రతిరూపంగా నిలుస్తారని అన్నారు. యేసుక్రీస్తు జననాన్ని స్మరించుకోవడం, దేవుని కృపకు కృతజ్ఞతలు చెప్పడం సంప్రదాయమన్నారు.

క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. అనంతరం క్రిస్టియన్ మైనార్టీ సంఘం నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, తాండూరు తహసీల్దార్ తారాసింగ్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు కిరణ్, మత పెద్దలు, పాస్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పండగలా కందుకూరి రాజ్ కుమార్ జన్మదినం